Naga Chaitanya,Sai Pallavi New Movie regular shoot begins under sekhar kammula direction.
#NagaChaitanya
#SaiPallavi
#SekharKammula
#samantha
#fida
#NC20
యువ సామ్రాట్ అక్కినేని నాగచైత్య, హిట్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే అఫీషియల్‌గా ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన రెగ్యులర్ షూట్ మొదలు పెట్టారు. ఈ రోజే (సెప్టెంబర్ 9) పూజా కార్యక్రమాలు నిర్వహించి సెట్స్ పైకి వచ్చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ గత నెలలోనే ప్రారంభమవుతుందని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. నాగచైతన్య కెరీర్‌లో 20 సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో చైతూ సరసన ఫిదా బ్యూటీ సాయి పల్లవి చిందులేయనుంది. ఇటీవలే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల.. అంతకు మించిన ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందించనున్నారని తెలుస్తోంది.